ప్రస్తుతం కెరీర్ ప్లానింగ్ విషయంలో చాలా క్లియర్‌గా ముందుకెళ్తోంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఈ చెన్నై సుందరి చేతిలో ఫీ మేల్ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు ఓ హాలీవుడ్ ప్రాజెక్టు కూడా ఉంది. అదేవిధంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ (Varun Dhawan)తో కలిసి వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. తాజాగా ఓ స్టన్నింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మరో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee) ఈ ఏడాది పూర్తి స్తాయిలో ప్రొడక్షన్స్ పనులపై ఫోకస్ పెట్టాలనుకుంటుందట.
ఓ ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తుందని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరితో సినిమా చేయాలనుకుంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది. హిందీలో రాబోతున్న ఈ చిత్రంలో సమంత మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ చేయబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్. అంతేకాదు ఈ సినిమా సమంతకు బాలీవుడ్ ఎంట్రీ మూవీ కాబోతుండటం విశేషం. సామ్‌కు ఇప్పటికే కథ ఇచ్చిందని, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నాయన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
శివ నిర్వాణ-విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత తాప్సీ నిర్మించబోతున్న సినిమాలో సామ్ జాయిన్ కానుందట. ప్రస్తుతం శివ నిర్వాణ (Siva Nirvana) డైరెక్షన్లో వస్తున్న సినిమా కోసం కశ్మీర్లో ఉంది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్లో సాగే లవ్ స్టోరీ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది.
Read Also : SVP Pre Release Business | సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాకే..!
Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్
Read Also : Sathi First Look | ‘సతి’ ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచేస్తున్న ఎంఎస్ రాజు