SVP Pre Release Business | సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాకే..!
మే 12న గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) అప్ కమింగ్ ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). మే 12న గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పరశురాం (Parasuram) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. తాజాగా ఈ క్రేజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇండస్ట్రీ ట్రేడ్ సర్కిల్ టాక్ ప్రకారం సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.120 కోట్ల వరకు జరిగిందట. ఈ ఫిగర్ చూస్తుంటే సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బాస్టర్ టాక్‌తో బాక్సాపీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపించబోతుందని తెలిసిపోతుంది. ఈ చిత్రం వీకెండ్లో భారీ వసూళ్లను సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీక్ డేస్ షురూ అయిన తర్వాత థియేటర్లకు జనాలు తాకిడి ఎలా ఉంటుంది..కలెక్షన్ల తీరు ఎలా ఉంటుందో చూడాలి మరి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్, ట్రైలర్లో వచ్చే మహేశ్ మార్క్ డైలాగ్స్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను భారీ మొత్తంలో జరుగడంలో కీ రోల్ పోషించాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్లో బిజినెస్ చేసిందంటే..విడుడలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Read Also : Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్
Read Also : Sathi First Look | ‘సతి’ ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచేస్తున్న ఎంఎస్ రాజు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

