కెరీర్లో గ్లామరస్ పాత్రలతోపాటు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది చెన్నై భామ సమంత (Samantha). ఈ బ్యూటీ ప్రస్తుతం మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించబోతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఆర్మీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడట.
కాగా సమంతకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మొదట ప్రియురాలిగా..ఆ తర్వాత గృహిణిగా కనిపించబోతుందట. ఇందులో కశ్మీర్ మహిళ (Kashmir Woman)గా సామ్ కనిపించబోతుందని తెలుస్తోండగా..దీనిపై శివ నిర్వాణ టీం నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్లో కనిపించనుండగా..షూటింగ్లో ఎప్పుడు జాయిన్ అవుదామా..? అని ఎక్జయిటింగ్‌గా చూస్తోంది సామ్.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movie Makers)పై తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్ లో షురూ కానుంది. కశ్మీరీ మహిళ పాత్రలో సమంత అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఫిక్స్ అయిన శివనిర్వాణ ఈ రోల్‌కు ఎంపిక చేశాడట. నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శివనిర్వాణ మళ్లీ విజయ్-సామ్ సినిమాతో ట్రాక్‌లోకి రావాలని ఎదురుచూస్తున్నాడు. నానితో తెరకెక్కించిన టక్ జగదీష్ ఓటీటీలో విడుదలవగా..బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.