Champion | టాలీవుడ్ యాక్టర్ రోషన్(Roshan Meka) మేక లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఛాంపియన్. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గిర గిర గింగిరాగిరే సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. తాజాగా మరో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఐయామ్ ఏ చాంపియన్ లిరికల్ వీడియో సాంగ్‌ను సాయంత్రం 5 గంటలకు స్టార్ హీరోయిన్ సమంత లాంచ్ చేయనుంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానుందని.. రోషన్ ఇందులో ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) హీరోయిన్గానటిస్తుంది.
#IAmAChampion Lyrical Video Song launch TODAY at 5 PM, by our #Samantha ✨#Roshan #PradeepAdvaitam #AnaswaraRajan #Santhosh #MickeyJMeyer pic.twitter.com/6l5tBWu7WJ
— Shreyas Sriniwaas (@shreyasmedia) December 21, 2025