నాగచైతన్య (Naga Chaitanya) నుంచి విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి చర్చకు ఛాన్స్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుపోతుంది చెన్నై సుందరి సమంత (Samantha). తన గతం తాలూకు అనుభవాలను మనసులోనే పెట్టుకుని..కేవలం ప్రొఫెషనల్ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సామ్ నెట్టింట్లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ సినిమా పోస్టర్ (Majili) ను ఇన్ స్టా స్టోరీస్‌లో మజిలీ పోస్టర్‌ను షేర్ చేసుకోవడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. అయితే సామ్ సడెన్‌గా ఇలా ఎందుకు చేసిందో డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అయితే అసలు విషయం ఏంటంటే..సామ్, చైతూ కాంబినేషన్లో శివ నిర్వాణ తెరకెక్కించిన మజిలీ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సామ్, చైతూ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి.
ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది. థర్డ్ యానివర్సరీ సందర్భంగా సమంత ఇలా మజిలీ పోస్టర్‌ను షేర్ చేసుకుందట. తన సినీ కెరీర్లో చేరుకున్న మైల్‌స్టోన్స్ ను, సక్సెస్ సామ్ ఎప్పటికపుడు అందరితో పంచుకుంటుందనే విషయం తెలిసిందే. ఎలాంటి గ్లామర్ షోకు ఆస్కారం లేకుండా ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్లో అద్బుతంగా నటించింది సమంత.
కాబట్టి తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ కావడంతో ఆ క్షణాలను ఇలా షేర్ చేసుకుంది సామ్. మొత్తానికి సామ్ పక్కా ప్రొఫెషనల్ అంటూ ఈ పోస్ట్ తో చెప్పకనే చెప్తోంది.