Maa Inti Bangaram | ఇటీవలే డైరెక్టర్ రాజ్నిడిమోరుతో దీపావళి వేడుకల్లో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ ఇద్దరూ కలిసి సెట్రేషన్స్లో పాల్గొనడంతో డేటింగ్ రూమర్స్‌పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. సమంత తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టింది. సామ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం. ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిందని తెలిసిందే.
ముందుగా షేర్ చేసిన అప్డేట్ ప్రకారం హైదరాబాద్‌లో బుధవారం సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత లీడ్ రోల్లో హోం ప్రొడక్షన్స్ Tralala Moving Pictures బ్యానర్‌పై వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను నందినీరెడ్డి టీం వెల్లడించనుంది.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లో గృహిణిగా చేతిలో గన్ పట్టుకున్న లుక్‌లో కనిపిస్తున్న సామ్.. మరి మా ఇంటి బంగారంలో ఎలాంటి రోల్లో కనిపించబోతుందన్నది ఆసక్తి నెలకొంది. సమంత ఇప్పటికే నిర్మాతగా శుభం సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో కామియో రోల్ కూడా చేసింది సమంత.
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు