Samantha | అగ్రకథానాయిక సమంత (Samantha) పోస్ట్ చేసిన తాజా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సామ్ ట్రలాలా పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో సామ్ హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు సమంతకు ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.
విజయ్ దేవరకొండతో చివరగా ఖుషి సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) వెబ్‌సిరీస్‌లో మెరిసిన సమంత.. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Brahmand) షూట్లో జాయిన్ అయింది.
Also Read..
Khaidi 2 | ఢిల్లీ వస్తున్నాడు.. ‘ఖైదీ 2’ అప్డేట్ ఇచ్చిన కార్తీ
Ghaati | ఏంటీ.. అనుష్క- క్రిష్ ఘాటి విడుదల వాయిదా పడనుందా..?