Ghaati | టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా స్థాయి స్టార్ డమ్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది బెంగళూరు భామ అనుష్కా శెట్టి (Anushka Shetty). ఈ బ్యూటీ కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి (Ghaati). తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ మూవీని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్టు యూవీ క్రియేషన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదలకు ఇంకో నెల రోజుల సమయమే ఉంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీజర్ రిలీజ్ మినహా ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లేకపోవడంతో.. విడుదల అనుకున్న సమయానికి ఉంటుందా..? అనే దానిపై డైలమా నెలకొన్నది.
ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్‌గా మాత్రమే ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి మేకర్స్ రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో ఘాటి ఉండనుందని నెట్టింట జోరుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్‌తోపాటు గ్లింప్స్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఘాటి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
Nani| కోర్ట్ మూవీ సక్సెస్ ఆనందంలో స్టేజ్‌పై చిందులేసిన నాని.. వీడియో వైరల్
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Tirumala | తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ?