Nani| నేచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రీసెంట్గా వచ్చిన కోర్ట్ కూడా సక్సెస్ అయింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా నడుస్తోంది. హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానియన్ సంగీతం అందించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా.. నాని సమర్పకుడిగా వ్యవహరించారు.
చిత్రంలో పోక్సో యాక్ట్ గురించి చెప్పుకొచ్చారు. భారతదేశంలో 18 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి వచ్చిన ఈ చట్టాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అని సినిమాలో చాలా అందంగా చూపించారు. ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ తో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి చిత్రానికి రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్రా , నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్లో ఈ సినిమాకు రూ.10 కోట్ల మేర బిజినెస్ చేసింది. కోర్ట్ లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావల్సి ఉంది.
అయితే అది సులువుగా వచ్చేలా ఉంది.ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో నాని వెంటనే సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో యువ నటీనటులు ఈ సినిమా చార్ట్ బస్టర్ ప్రేమలో సాంగ్ కి స్టెప్పేస్తూ నానిని కూడా స్టేజి మీదకి తీసుకెళ్లిపోయారు. ఇద్దరు పిల్లలు, ప్రియదర్శితో కలిసి నాని స్టెప్పులు అదరగొట్టారు. సినిమా హిట్ అయిన ఆనందంలో నాని కూడా మంచి జోష్ తో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నాని తన మార్క్ ఈజ్ తో డ్యాన్స్ చేయడం ఈవెంట్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.