DILLI RETURNS | తమిళ హీరో కార్తీ (Karthi), తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ “ఖైదీ” (Kaithi). 2019లో విడుదలైన ఈ చిత్రం కార్తీ కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు రాబోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మూవీ సీక్వెల్ అప్డేట్ను పంచుకున్నాడు కార్తీ. “ఖైదీ 2” (Khaidi 2) త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు కార్తీ. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా ఈ సినిమా రాబోతుండగా.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో “కూలీ”(Coolie) అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత “ఖైదీ 2” సెట్స్‌పైకి వెళ్లనుంది. కార్తీ ఇందులో ఢిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపించబోతుండగా.. అతని జైలుకు వెళ్లడానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. అలాగే, విక్రమ్, లియో సినిమాలతో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు కూడా ఉండవచ్చని అభిమానులు నుంచి కామెంట్లు వస్తున్నాయి.
DILLI RETURNS
Let it be another fantastic year @Dir_Lokesh@DreamWarriorpic @KvnProductions pic.twitter.com/sLLkQzT0re
— Karthi (@Karthi_Offl) March 15, 2025