అగ్ర కథానాయిక సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ట్రలాలా పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్ని పోషించారు.
ఈ కథలో కావల్సినంత వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. తమ సంస్థలో రూపొందించిన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సమంతా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మృదుల్ సుజిత్ సేన్, రచన: వసంత్ మరిగంటి, దర్శకుడు: ప్రవీణ్ కండ్రేగుల.