Samantha | ఆ సమయం చాలా కష్టంగా సాగింది.. విడాకులపై పరోక్షంగా స్పందించిన సమంత
Samantha | నాగ చైతన్యతో విడాకులపై నటి సమంత పరోక్షంగా స్పందించింది. ఆ సమయం తనకు ఎంతో కష్టంగా (extremely difficult) గడిచిందని చెప్పుకొచ్చింది.
Samantha | టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు పొందిన సమంత (Samantha), అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. సామ్.. గత కొన్ని రోజులుగా మయోసైటిస్ (Myositis)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఇప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకుని తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది.
అందులో తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే నాగ చైతన్యతో విడాకుల సందర్భాన్ని పరోక్షంగా గుర్తు చేసుకుంది. మయోసైటిస్కు సరిగ్గా ఏడాది ముందు తనకు ఎంతో కష్టంగా గడిచిందని (extremely difficult) తెలిపింది. ‘ఈ సమస్య (మయోసైటిస్) రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు ఎంతో కష్టంగా గడిచింది. అప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను నా మేనేజర్ హిమాంక్తో కలిసి ముంబై నుంచి ప్రయాణిస్తున్నా. ఆ సమయంలో నాకు చాలా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపిస్తోందని తనతో చెప్పాను. నేను ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను, తృప్తిగా నిద్రపోగలుగుతున్నాను, లేచి నా పనిపై దృష్టి పెట్టగలుగుతున్నాను అని అనిపించే లోపే ఈ అనారోగ్యం నాపై దాడి చేసినట్లు తెలిసింది’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది. మయోసైటిస్ రావడానికి సరిగ్గా ఏడాది ముందు సమంత.. చైతన్యతో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దాన్ని ఉద్దేశించే సామ్ అప్పుడు చాలా కష్టంగా గడిచిందని అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చినట్లుంది.
Lok Sabha elections | లోక్సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. మార్చి 9 తర్వాత షెడ్యూల్ విడుదల..!
Rahul Gandhi | పరువునష్టం కేసులో రాహుల్కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన యూపీ కోర్టు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

