Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంతకు ఓటీటీ ఉత్తమ నటి అవార్డు (Best Actress OTT Award) దక్కింది. సామ్ నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny)లో ఉత్తమ నటన కనబరిచినందుకు ఓ మీడియా సంస్థ సమంతను (Samantha) ఈ పురస్కారంతో సత్కరించింది. దీన్ని గెలుచుకోవడంపై సామ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సిరీస్‌ను పూర్తి చేయడమే తనకు ఒక అవార్డు అని పేర్కొంది.
రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్ వల్లే తాను ఈ సిరీస్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగినట్లు చెప్పుకొచ్చింది. ఈ సిరీస్‌ను కంప్లీట్ చేయడం కోసం వారు ఎంతో ఓపికతో వ్యవహరించారని, తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపింది. తనను నమ్మిన వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు సామ్ చెప్పుకొచ్చింది.
Take a bow to you Bangaram 🙇@Samanthaprabhu2 🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/SQnnHST9Ec
— AkaSam (@SammuVerse) March 21, 2025
కాగా, విజయ్ దేవరకొండతో చివరగా ‘ఖుషి’ సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇటీవలే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘సిటాడెల్: హనీ బనీ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ Rakt Brahmand వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది.
Also Read..
Samantha| సమంత ఫోన్లో లవ్ అనే పేరుతో ఉండే కాంటాక్ట్ నెంబర్ ఎవరిది..తెలిస్తే షాక్ అవుతారు..!
Naga Chaitanya- Sobhita| తొలిసారి తమ లవ్ స్టోరీ రివీల్ చేసిన శోభిత.. ఇది విన్న తర్వాత అందరు షాక్
Megastar Chiranjeevi | చిరంజీవి లండన్ పర్యటనలో వివాదం.. అభిమానులను అలెర్ట్ చేసిన మెగాస్టార్