Samantha|పదిహేనేళ్ల కిందట టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి అందరి మనసులని గెలుచుకుంది అందాల ముద్దుగుమ్మ సమంత. ఏ మాయ చేశావే చిత్రంలో జెస్సీ అనే పాత్రతో అందరిని కట్టి పడేసింది. ఆ తర్వాత సమంతకి ఎదురే లేదు. చేసిన ప్రతి సినిమాలో కూడా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఒకప్పుడు సమంత పేరు వినిపిస్తే చాలు కుర్రాళ్లంతా కిర్రెక్కిపోయేవాళ్లు. సమంత లాంటి గార్ల్ ఫ్రెండ్ తమకి ఉంటే బాగుండు అని అనుకునే వాళ్లు. ఇక నాగ చైతన్యని సమంత వివాహం చేసుకున్న తర్వాత చాలా మంది అబ్బాయిలు కుళ్లుకున్నారు. ఇక విడాకుల తర్వాత సమంత జీవితం ఇలా అయిందేంటని బాధపడ్డారు కూడా.
సమంత తన కెరియర్లో బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు..వంటి హిట్స్ అందిపుచ్చుకోవడంతో సౌత్ ఇండస్ట్రీలోనే సామ్ పేరు మార్మోగిపోయింది. సమంత కోసమే సినిమాలకి వెళ్లిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించింది. వెబ్ సిరీస్‌లు చేస్తూ అప్పుడప్పుడు సినిమాలలో కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇక సమంత ప్రస్తుతం సింగిల్ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. ఇక ఇప్పుడు సమంత ఫోన్లో లవ్ అనే పేరుతో ఒక నెంబర్ సేవ్ అయి ఉండగా, అది ఎవరిదా అని పలువురు నెటిజన్లు క్యూరియాసిటీ వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత ఎవరి పేరుని లవ్ అని పెట్టుకుంది అంటే తన తండ్రి పేరుని. సమంత తండ్రి గతేడాది నవంబర్‌లో చనిపోయాడు. తన తండ్రి మరణం తర్వాత సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్ చేస్తూ.. నాన్నా… మీ లాంటి వారు ఇంకెవరూ రారు. మీరు లేకుండా నేనెలా? ఈ లోటును భర్తీ చేసుకునే మార్గం నాకు కనబడటం లేదు…అంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆ పోస్ట్ చూసే సమంతకి ఆమె తండ్రి అంటే ఎంత ప్రేమ అనేది అర్ధమైంది. నాన్నని మరిచిపోలేక సమంత ఇప్పటికీ బాధపడుతూ ఉందట. మొత్తానికి సామ్ తన తండ్రి పేరుని కాంటాక్ట్స్‌లో లవ్ పేరుతో సేవ్ చేసుకోవడం చర్చనీయాంశం అయింది.