Naga Chaitanya- Sobhita| గత కొద్ది రోజులుగా శోభిత- నాగ చైతన్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. వారికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒకర వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా వీరి లవ్ స్టోరీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు చైతూ- శోభితల లవ్ స్టోరీ ఎక్కడ లీక్ కాలేదు. కాని తొలిసారి శోభితనే ఆ సీక్రెట్ రివీల్ చేసింది. ఇది విని అందరు షాక్ అవుతున్నారు. రీసెంట్గానాగ చైతన్యతో కలిసి శోభిత ధూళిపాళ వోగ్ మ్యాగజిన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో శోభిత ఎన్నో విషయాలను రివీల్ చేసింది.
అలానే తమ లవ్ స్టోరీ, పరిచయం, ఇలా పలు విషయాల గురించి షేర్ చేసింది.చైతూ ఎంతో బ్యాలెన్డ్స్ గా,చాలా క్లియర్ మైండ్ తో ఉంటాడని చెప్పిన శోభిత అతడిని కలిసేవరకు అంత డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని నాకు తెలియదని చెప్పింది. అంతేకాకుండా ఏ పనినైనా చైతూ 100% చేస్తాడటని పేర్కొంది. ఇక ఏ సిట్యువేషన్లో అయిన కూడా చైతూ పాజిటివ్ కోణంలోనే ఆలోచిస్తాడట. సక్సెస్, ఫెయిల్యూర్ ని కూడా ఒకేలా చేస్తాడని తెలియజేసింది. కస్టడీ ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉన్నాడో, తండేల్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు చైతూ అలానే ఉన్నాడని శోభిత పేర్కొంది. ఇక తమ లవ్ స్టోరీ గురించి చెబుతూ ఓ రోజు నేను ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించాను.
అప్పుడు ఓ నెటిజన్ నన్ను నాగ చైతన్యని ఎందుకు ఫాలో కావడం లేదని అడిగాడు. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడగా, అందులో 70 మందిని ఆయన ఫాలో అవుతుండగా, నేను కూడా అందులో ఉండడం చూసి షాక్ అయి వెంటనే ఫాలో అయ్యాను. ఇక ఆ తర్వాత ఇద్దరం చాటింగ్ చేసుకున్నాం. కామన్ ఇంట్రెస్ట్ ల గురించి మాట్లాడుకున్నాం. మా లవ్ స్టోరీ కూడా ఫుడ్తోనే స్టార్ అయింది. చైతూ ఎక్కువగా సుషీ గురించి పోస్ట్ చేసేవాడు. అది చూసి అట్రాక్ట్ అయ్యానని పేర్కొంది శోభిత. 2022లో లంచ్ డేట్ కోసం చైతన్య ముంబై వెళ్ళాడట. ఆ తర్వాత శోభిత పేరెంట్స్ ని కూడా కలిసాడట. ఇకశోభిత కూడా నాగ్ని కలవడం, వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం వెంటవెంటనే జరిగాయట. అయితే చైతన్యను కలవకముందు తాను ముంబైలోనే సెటిల్ అవాలని అనుకున్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో రిలేషన్ లోకి వెళ్లకూడదని భావించానంటూ శోభిత పేర్కొంది.