Samantha | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సమంత (Samantha)తో విడాకుల అనంతరం నటి శోభితతో ఏడడుగులు వేశారు. గతేడాది వీరి వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో చైతూ రెండో వివాహం చేసుకోవడంపై సమంత తాజాగా స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు చైతన్య రెండో పెళ్లి చేసుకోవడం గురించి ప్రశ్న ఎదురైంది. ‘మీ మాజీ (నాగ చైతన్యను ఉద్దేశిస్తూ) కొత్త జీవితంలోకి అడుగు పెట్టినందుకు మీకేమైనా అసూయగా (envy) ఉందా..?’ అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన సామ్.. ‘నో.. నా లైఫ్‌లో అసూయకు తావు లేదు. అది నా జీవితంలో భాగం కావడం కూడా నేను అంగీకరించను. అసూయే అన్ని చెడు పనులకు కారణమని నేను భావిస్తాను’ అంటూ సమాధానిచ్చింది. అంతేకాకుండా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని.. పాత రిలేషన్ షిప్ నుంచి బయటకు రావడానికి ఎంతో శ్రమించానంటూ చెప్పుకొచ్చింది. సమంత కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండతో చివరగా ‘ఖుషి’ సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇటీవలే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘సిటాడెల్: హనీ బనీ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ Rakt Brahmand వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది.
Also Read..
Kangana Ranaut | వ్యాపార రంగంలోకి బాలీవుడ్ క్వీన్.. హిమాలయాల్లో కేఫ్
Thiruveer | క్రేజీ లైనప్.. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా జార్జిరెడ్డి యాక్టర్ తిరువీర్