Samantha | 2025.. ముగింపుకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో చోటుచేసుకున్న సంఘటనలను ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha Ruth Prabhu) సైతం ఈ ఏడాది తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఆసక్తికర ఫొటోలను షేర్ చేశారు.
2025 ముగింపు సందర్భంగా సామ్ షేర్ చేసిన ఫొటోల్లో.. తన పెళ్లి ఫొటో (Wedding Photo ) కూడా ఉంది. వాటితోపాటూ సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన మొదటి చిత్రం ‘శుభం’ ఫొటోలు, పికిల్‌బాల్ లీగ్ ఫొటోలు వంటివి ఉన్నాయి. వాటిని షేర్ చేసిన సామ్.. ఈ ఏడాది అద్భుతమైనదిగా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, ఈ నెల ఒకటో తేదీన సామ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. దాంతోపాటూ పలు సినిమాలతో బిజీగా ఉంది.
Also Read..
Sai Kumar | హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ‘శంబాల’.. తనయుడికి తొలి హిట్ దక్కడంతో…
Hebah Patel | శివాజీ వ్యాఖ్యల వివాదం ..హెబ్బా పటేల్ తెలివిగా తప్పించుకుందిగా..!