ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Samantha)లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో దక్షిణాది నుంచి టాప్‌లో ఉంటుంది చెన్నై సుందరి సమంత (kushi). ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది. తన అదిరిపోయే యాక్టింగ్‌తో హిందీలో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గ్లామరస్ పాత్రైనా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర అయినా, డీగ్లామరస్ రోల్ అయినా.. తను చేసే పాత్రకు ప్రాణం పోస్తుంది సామ్.
పుష్ప సినిమాలో ఉ అంటావా మావా.. ఊ ఊ అంటావా అంటూ హాట్ హాట్ స్టెప్పులతో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. కాగా సమంత గురించి ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్ జోరుగా వినిపిస్తోంది. సోలో హీరోయిన్గా ఓ మెరుపు మెరిసిన సామ్.. సిల్వర్ స్క్రీన్‌పై భార్య పాత్రల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో మనం, మజిలీ సినిమాల్లో గృహిణిగా నటించి.. మంచి మార్కులు కొట్టేసింది. తమిళంలో తేరి, సూపర్ డీలక్స్ లో కూడా నటించింది. అయితే మధ్యలో మళ్లీ అలాంటి రోల్స్ చేయలేదు. ఇక సమంత చాలా కాలం తర్వాత మరోసారి గృహిణి పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతోందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
విజయ్ దేవరకొండతో కలిసి తాజాగా ఖుషిలో నటిస్తోంది సమంత. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సెకండాఫ్‌లో హౌజ్‌వైఫ్ (గృహిణి)గా కనిపించనుంది. శివనిర్వాణ డైరెక్షన్లో వచ్చిన మజిలీలో కూడా సెకండాఫ్‌లో గృహిణిగా మెరిసింది సామ్. ఈ పాత్రకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇదే ఫార్ములా ఖుషిలో కూడా రిపీట్ చేస్తుండటంతో.. ఈ సారి కూడా హిట్టు పడటం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also :
RC15 | రాంచరణ్ ఆర్సీ15 టైటిల్ లాంచ్‌పై దిల్ రాజు క్లారిటీ..!
Varun Sandesh | ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
Dhamki | విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
KA9 | స్పీడు మీదున్న కిరణ్ అబ్బవరం.. కొత్త సినిమా లాంఛ్
Sabdham | ఆది పినిశెట్టి శబ్దంలో అందాల తార.. మేకర్స్ నయా అప్డేట్