Chinmayi Sripaada | సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి శ్రోతల మనసులు దోచుకుంది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పలువురు స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఐదేళ్ల క్రితం మొదలైన ‘మీ టూ’ (Mee Too) ఉద్యమంలో గొంతెత్తిన చిన్మయిపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు నాలుగేళ్లుగా తమిళ్ (Tamil)లో ఒక్క పాటా పాడలేదు. డబ్బింగ్ కూడా చెప్పలేదు. ఇతర భాషల్లో మాత్రం డబ్బింగ్ చెప్తూ, పాటలు పాడుతూ తన పని తాను చేసుకుంటూ పోయేది. ఈ నేపథ్యంలోనే తాజాగా నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి కంబ్యాక్ ఇచ్చింది. ఓ చిత్రంలో హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది.
విజయ్ (Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లియో’ (Leo). ఇందులో త్రిష (Trisha) పాత్రకు చిన్మయి గాత్రం అందించింది. తమిళం, తెలుగు, కన్నడలో డబ్బింగ్ చెప్పింది. ఈ విషయాన్ని చిన్మయి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. తనకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే, తన ప్రాణ స్నేహితురాలు కోలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ ఎంట్రీ ఇవ్వడంపై నటి సమంత స్పందించారు. చిన్మయి మళ్లీ డబ్బింగ్ చెప్పడంపై సంతోషం వ్యక్తం చేశారు.
I am a million times grateful to Mr Lokesh Kanagaraj and Mr Lalit for having taken this stand.
THAT. IS. MY. VOICE. IN. LEO. FOR. TRISHA.
And guess what? I have dubbed in Tamil, Telugu AND Kannada. #Badass https://t.co/x747eBCzU7
— Chinmayi Sripaada (@Chinmayi) October 5, 2023
కాగా, చిన్మయి-సమంత మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. సామ్ తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ సహా ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది తదితర చిత్రాల్లోని సమంత పాత్రకు చిన్మయినే వాయిస్ ఇచ్చింది. ఇటీవలే వచ్చిన ‘ఖుషి’ చిత్రంలో కూడా సమంత పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఇక సామ్.. తనకు వీలు కుదిరినప్పుడల్లా చిన్మయి ఇంటికి వెళ్తుంటుంది. అక్కడ గాయని పిల్లలతో సరదాగా ఆడుకుంటూ.. టైమ్ స్పెండ్ చేస్తుంటుంది.
ఇక, చిన్మయి.. ఐదేళ్ల క్రితం మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. తమిళ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు దక్షిణాదిన సంచలనం సృష్టించాయి. తమిళ ఇండస్ట్రీ ఆమెపై నిషేధం కూడా విధించింది. అయితే వైరముత్తు లైంగిక వేధింపుల కేసులో న్యాయం కోసం చిన్మయి పోరాటం సాగిస్తూనే ఉంది.
Also Read..
IIT Kanpur | ఐఐటీ కాన్పూర్లో రెండు జట్ల మధ్య ఘర్షణ.. కుర్చీలతో కొట్టుకున్న ఆటగాళ్లు.. VIDEO
Bhagavanth Kesari | బతుకమ్మ ఆడిన శ్రీలీల, కాజల్.. వీడియో వైరల్
Chaari 111 Movie | షూటింగ్ పూర్తి చేసుకున్న వెన్నెల కిషోర్ ‘చారి 111’