Bhagavanth Kesari | బతుకమ్మ ఆడిన శ్రీలీల, కాజల్.. వీడియో వైరల్
Bhagavanth Kesari | తెలంగాణలో ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండగ ‘బతుకమ్మ’ (Bathukamma) సందడి ప్రారంభమైంది. తాజాగా ప్రముఖ సినీ నటులు శ్రీలీల (Sree Leela), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) బతుకమ్మ ఆడి అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.
Bhagavanth Kesari | తెలంగాణలో ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండగ ‘బతుకమ్మ’ (Bathukamma) సందడి ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలు ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులపాటు ఊరూవాడా సందడి నెలకొంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాలు పంచుకుంటారు. ఇందులో భాగంగా యువతులు రకరకాల పూలను సేకరించి వాటితో బతుమ్మను కొలువు దీర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అంతా ఒకచోట చేరి బతుకమ్మ చుట్టు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. పండుగ వేళ పలువురు సెలబ్రిటీలు సైతం బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ప్రముఖ సినీ నటులు శ్రీలీల (Sree Leela), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) బతుకమ్మ ఆడి అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా వస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari ). అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు. శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. బాలకృష్ణ, కాజల, శ్రీలీల సహా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల, కాజల్ స్టేజ్‌పై బతుకమ్మ ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
భగవంత్ కేసరి చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ ప్రతినాయుడిగా నటించారు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
#Kajal and #Sreeleela playing Bathukamma #BhagavanthKesariOnOCT19 pic.twitter.com/lebZjFn9rj
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 8, 2023
Also Read..
Shah Rukh Khan | షారుఖ్‌ఖాన్‌కు హత్య బెదిరింపులు.. భద్రత పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం..!
Afghanistan Earthquake | అఫ్గాన్‌లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య
Bathukamma | బతుకమ్మకు తోడుగా గౌరమ్మ ఎందుకు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

