Shah Rukh Khan | ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసి ఇండియన్ హిస్టరీలోనే అలాంటి అరుదైన ఘనత సాధించిన హీరోగా షారుఖ్ సంచలనం సృష్టించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఎన్నో ఏళ్లుగా హిట్టులేక సతమతమవుతున్న షారుఖ్‌కు ఈ రెండు సినిమాలు మంచి బూస్టప్ ఇచ్చాయి. ప్రస్తుతం అదే జోష్‌తో రాజ్ కుమార్ హిరానీతో కలిసి డంకీ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హిందీ ఆడియెన్స్ సహా సౌత్ ప్రేక్షకులు కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు
ఇక ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్‌కు ఈ రెండు సినిమాల తర్వాత బెదిరింపు ఫోన్ కాల్స్, డెత్ నోట్స్ రావడం మొదలయ్యాయి. ఆయనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ముంబైలో షారుఖ్ ఖాన్ నివాసం ఉంటున్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ రావడం మొదలుపెట్టాయి. దీనిపై షారుఖ్ ఖాన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇక షారుఖ్ విజ్ఞప్తి మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ (Y +) భద్రతను కల్పించింది. ఈ భద్రతకు సంబంధించిన ఖర్చును షారుఖ్ ఖాన్ చెల్లించనున్నారు. ఈ Y+ భద్రతలో ఆరుగురు పోలీసు కమాండోలు, MP-5 మెషిన్ గన్లు, AK-47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్ వంటి ఆయుధాలుతో పోలీసులు షారుఖ్‌ఖాన్‌కు అంగరక్షకులుగా ఉంటారు.