Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బ్రహ్మనందం తర్వాత ఆ స్థాయి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. తెరపై వెన్నెల కిషోర్ కనిపించాడంటే చాలు.. నవ్వు దానంతట అదే వస్తుంది. అంతలా తన కామెడితో చేరువయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ నటుడు హీరో అవతారమెత్తాడు. వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు కాస్ట్ అండ్ క్రూతో ఉన్న వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా కథ విషయానికొస్తే ఓ సీటిలో అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. అవి చేధించే రహస్య గూఢచారి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కిశోర్ సీక్రెట్ స్పైగా కనిపించనుండగా.. మురళి శర్మ స్పై ఏజెన్సీ హెడ్‌గా కనిపించనున్నారు. చెన్నై సొగసరి సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటిస్తుంది. సిమన్ కే కింగ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది.
Vennela Kishore’s SPY action comedy #Chaari111 coming to theatres soon. The shoot of the film is wrapped up. pic.twitter.com/DRDpe3Erpa
— Aakashavaani (@TheAakashavaani) October 9, 2023