IIT Kanpur | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ (IIT Kanpur)లో విద్యార్థులు చితకొట్టుకున్నారు. కళాశాలలో శనివారం జరిగిన వార్షిక క్రీడా కార్యక్రమంలో (annual sporting event) రెండు కబడ్డీ జట్ల (kabaddi players) మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
వైఎంసీఏ-ఎన్ఎస్యూటీ జట్ల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పడి మరీ తన్నుకున్నారు. కుర్చీలతో దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘర్షణకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై ఐఐటీ కాన్పూర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
कानपुर: IIT में उद्घोष -2023 चल रहा है, कबड्डी खिलाड़ी आपस में भिड़ गए…।
देश भर के 450 कॉलेज के करीब 3000 स्टूडेंट ने उद्घोष में पार्टिसिपेट किया है…।#IIT #kanpur pic.twitter.com/G8cTDZL3J2
— Dilip Singh (@dileepsinghlive) October 9, 2023
Also Read..
Israel-Hamas War | ఇజ్రాయెల్‌కు మద్దతుగా రంగంలోకి అమెరికా యుద్ధ నౌకలు
Israel-Hamas War | మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి.. 260 మంది మృతి
Bhagavanth Kesari | బతుకమ్మ ఆడిన శ్రీలీల, కాజల్.. వీడియో వైరల్