Israel-Hamas War | మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి.. 260 మంది మృతి
Israel-Hamas War | ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం (Israel-Hamas War) తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. రెండు వైపులా 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Israel-Hamas War | ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం (Israel-Hamas War) తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు వైపులా 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క ఇజ్రాయెల్ (Israel)లోనే 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా మృతి చెందారు.
ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ (music fest) సైట్‌పై హమాస్ (Hamas) మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. రెండు దేశాల బార్డర్ వద్ద జరుగుతున్న ఓ మ్యూజికల్ పార్టీపై మిలటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కనిపించిన వారిని కనిపించినట్లు పిట్టల్లా కాల్చి చంపేశారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఆ ప్రదేశంలో మృతదేహాలు రక్తంమడుగుల్లో చల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే ఇప్పటి వరకూ 260 మృతదేహాలను మెడికల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ వెల్లడించింది.
హమాస్ చెరలో ఇజ్రాయెల్ పౌరులు
తమ ప్రాంతాల్లోకి చొరబడిన హమాస్ సాయుధులను నిలువరించేందుకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు ఇదే సమయంలో గాజా స్ట్రిప్‌లోని హమాస్ స్థావరాలపై బాంబు దాడులు కొనసాగిస్తున్నది. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు.. వృద్ధులతో సహా పలువురు మహిళలు, చిన్న పిల్లలను నిర్బంధించారు. వారిని గాజాకు తరలించినట్టు సమాచారం. తద్వారా ఇజ్రాయెల్ నిర్భందించిన వేలాది మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టేందుకు హమాస్ బేరం ఆడే ప్రయత్నం చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు దాడుల నుంచి తప్పించుకొనేందుకు సరిహద్దు సమీపంలోని అటు ఇజ్రాయెల్, ఇటు గాజా ప్రజలు తమ ఇండ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధంలో ఉన్నదని ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. కాగా, హమాస్ దాడిని ముందస్తుగా పసిగట్టంలో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ ఘోరంగా విఫలమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read..
Afghanistan Earthquake | అఫ్గాన్‌లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

