Samantha | టాలీవుడ్ అగ్ర నటి సమంత సక్సెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తానకి విజయాలంటే కేవలం సినిమాల విజయాలు, స్టార్డమ్ అని భావించేదాన్నని అయితే ఇప్పుడు తన దృష్టిలో స్వేచ్ఛ(Freedom) అనేదే అసలైన సక్సెస్ ఆమె స్పష్టం చేశారు.
ఈ విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. విజయానికి నిర్వచనం ఏమిటని అడిగితే నేను వెంటనే స్వేచ్ఛ అని చెబుతాను. నిరంతరం అభివృద్ధి చెందడం, పరిణతి సాధించడం, దేనికీ బందీగా ఉండకపోవడమే నా దృష్టిలో నిజమైన స్వేచ్ఛ. అదే అసలైన విజయం అని సమంత వివరించారు. ప్రస్తుతం తాను చేస్తున్న పనులు తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయని, వాటిని పూర్తి చేయడం కోసం ప్రతిరోజూ ఎంతో ఆనందంగా నిద్రలేస్తున్నానని ఆమె తెలిపారు. బహుశా నా చుట్టూ ఉన్నవారు గతంతో పోలిస్తే నేను ఇప్పుడు విజయం సాధించలేదని అనుకోవచ్చు. కానీ నా వ్యక్తిగత దృష్టిలో నేను గతం కంటే ప్రస్తుతం ఎక్కువ సక్సెస్‌గా ఉన్నాను అని సమంత తెలిపారు.
ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే సినిమాలో నటిస్తున్న సమంత ఇటీవల ‘శుభం’ అనే చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరిసిన సమంత, ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆమె అభిమానులకు హామీ ఇచ్చారు.
Read More