Shiva Jyothi | తీన్మార్ సావిత్రిగా… బిగ్ బాస్ శివజ్యోతిగా బుల్లితెర ప్రేక్షకుల్ని తెలంగాణ యాసతో ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తీన్మార్ వార్తలతో పాపులర్ యాంకర్‌గా పేరు సంపాదించిన తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లి మంచి పాపులర్ అయింది. దాదాపు 98 రోజుల పాటు హౌజ్‌లో ఉన్న ఈ భామ కంటెస్టెంట్స్‌కి గట్టి పోటే ఇచ్చింది. ఇక హౌజ్ నుండి బయటకు వచ్చాక పలు షోస్‌లో సందడి చేస్తూ అలరిస్తుంది. అలానే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన పలు వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.
శివజ్యోతి ఎక్కువగా తన భర్తతో కలిసి చేసిన వీడియోలే షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బాత్ రూమ్ వీడియో షేర్ చేసి షాకిచ్చింది. బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. భర్తని ఇంప్రెస్ చేయడం ఎలా అనే రొమాంటిక్ క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేయగా, ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. శివజ్యోతి గ్లామర్ విషయంలో ఎప్పుడు హద్దులు దాటింది లేదు. కాని ఒక్కసారిగా ఇలా బాత్ రూమ్ వీడియో షేర్ చేయడంతో అందరు అవాక్కవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆ మధ్య శివ జ్యోతి ఓ వీడియోలో తన ఇంటిని పరిచయం చేస్తూ.. నాకు జీవితంలో రెండే రెండు కోరికలు ఉండేవి. ఒకటి ప్రేమించిన గంగూలిని పెళ్లి చేసుకోవడం, రెండోది సొంత ఇల్లు ఉండాలని. అలా జీవితంలో రెండు కోరికలు పూర్తయ్యాయి అని చెప్పింది. తన భర్తతో కలిసి ఇంటి తలుపులు తెరిచి ఇల్లు మొత్తం తన ఫ్యాన్స్ కి చూపించింది. అయితే ప్రస్తుతానికి శివజ్యోతి రాయల్ లైఫ్ అనుభవిస్తున్నా గతంలో మాత్రం చాలా కష్టాలు పడిందట. ఆ విషయాలు కూడా పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది.