విడాకుల తర్వాత భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న సమంత.. కల నెరవేరిందంటూ వేదాంతం

Samantha char dham yatra | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వినిపిస్తుంది. అసలు చైతూతో ఆమె ఎందుకు విడిపోయింది? ఇందులో సమంత తప్పే ఉందా? విడాకులకు ఇవే కారణాలు అయి ఉంటాయి అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. దీంతో సమంతపై వస్తున్న ట్రోల్స్ చూసి ఆమె సన్నిహితులు ఎంతగానో బాధపడ్డారు. అక్కినేని ఫ్యామిలీ కోసం, నాగ చైతన్య కోసం సమంత ఎన్నో వదులకుందని.. వాటి గురించి తెలవకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని విన్నవించుకున్నారు. అయినా సరే తనపై ట్రోల్స్ ఆగకుపోవడంతో చివరకు కోర్టును కూడా ఆశ్రయించింది సమంత. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత తన రూట్ మొత్తం మార్చేసింది. తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి తో కలిసి సమంత చార్ధామ్ యాత్ర కు వెళ్లింది. అక్కడ ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో మునిగితేలుతుంది సామ్. వీటికి సంబంధించి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సమంత.. ఆధ్యాత్మిక యాత్ర వివరాలను అభిమానులతో పంచుకుంది. మహాభారతం చదివినప్పటి నుంచి హిమాలయాలు చూడాలని ఎంతగానో పరితపించి పోయా. ఎప్పటికైనా వీటిని చూడాలని కలలు గన్నా. గొప్ప అద్భుతాలకు నెలవు, దైవాలు కొలువైనా ఈ భూతల స్వర్గాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అంటూ రాసుకొచ్చింది. తన ఆధ్యాత్మిక యాత్ర ఎంతో ఉత్కంఠగా సాగిందని తెలిపింది.ఈ ట్రిప్ ఇంత స్పెషల్‌గా సాగడానికి ముఖ్య కారణం తన స్నేహితురాలు, సోదరి శిల్పారెడ్డినే కారణమని పేర్కొంది. కాగా, చార్ధామ్ టూర్.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటూ సామ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది శిల్పా రెడ్డి. ఏదైమైనా సమంత చార్ధామ్ యాత్ర పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.







లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha: భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న సమంత
Samantha: సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
samantha | తప్పులే నాకు కనిపిస్తాయి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha is back | సమంత ఈజ్ బ్యాక్..జిమ్‌లో కసరత్తులు
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

