తప్పులే నాకు కనిపిస్తాయి

సోషల్‌మీడియా వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలుంటాయని చెప్పింది సమంత. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడాల్సివస్తే ఆ మాటలు మౌనంకంటే బలంగా ఉండాలని తెలిపింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సినీ కెరీర్‌పై సీరియస్‌గా దృష్టిసారిస్తున్నది సమంత. తెలుగు, తమిళంతో పాటు హిందీలో సినిమాల్ని అంగీకరిస్తున్నది. తన భవిష్యత్ ప్రణాళికలతో పాటు కెరీర్ గురించి సమంత మాట్లాడుతూ ‘సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్‌ను నేను పట్టించుకోను. మాట్లాడటం కంటే కొన్ని సార్లు సైలెంట్‌గా ఉండటమే బాగుంటుంది. సమాధానం చెప్పాల్సి వస్తే అది మౌనం కంటే బలంగా ఉండాలి. ఆ రోజు మాట్లాడతా. తొలినాళ్లలో నాలో ఉన్న భయాల వల్ల పాత్రలు, కథాంశాల పరంగా ప్రయోగాలు చేయలేదు. గత ఐదేళ్లుగా నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నా. సవాళ్లను ధైర్యంగా స్వీకరించడం అలవర్చుకున్నా. నేను నటించిన సినిమాల్ని స్క్రీన్‌పై చూడను. నా సినిమా వస్తుందంటే టీవీ ఆపేస్తాను. నన్ను నేను స్క్రీన్‌పై చూసుకుంటే తప్పులే ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో హిందీ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా దక్షిణాదిలో బిజీగా ఉండటంలో అంగీకరించలేకపోయాను. ‘ఫ్యామిలీమ్యాన్-2’ విజయం బాలీవుడ్ సినిమాలు చేసేలా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Samantha
- YouTube channels
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

