Samantha is back | సమంత ఈజ్ బ్యాక్..జిమ్‌లో కసరత్తులు
కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ ఎవరంటే..? ఠక్కున గుర్తొచ్చే పేరు సమంత (Samantha). ఫిట్నెస్ విషయంలో చురుకుగా ఉండే సామ్ విడాకుల తర్వాత మళ్లీ మనుపటిలా జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ ఎవరంటే..? ఠక్కున గుర్తొచ్చే పేరు సమంత (Samantha). వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్ కొనసాగించింది సామ్. అయితే నాగచైతన్యతో విడాకుల అంశం నేపథ్యంలో పూర్తి స్థాయిలో కెరీర్‌పై ఫోకస్ పెట్టలేదనడానికి కొంత కాలంగా వార్తలే ఉదాహరణగా చెప్పొచ్చు. చైతూతో విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత తనను ఒంటరిగా ఉండనివ్వండని సోషల్‌మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది సామ్.
ఫిట్నెస్ విషయంలో చురుకుగా ఉండే సామ్ విడాకుల తర్వాత మళ్లీ మనుపటిలా జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిందని తాజా పోస్ట్‌తో అర్థమవుతుంది. జిమ్‌లో 30కేజీల డంబెల్ (30 kg dumbbell) ను ఎత్తుతున్న స్టిల్‌తోపాటు వీడియోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన సామర్థ్యానికి మించి బరువును ఎత్తేలా ప్రేరణను కలిగించిన ట్రైనర్‌కు ప్రశంసిస్తూ..ఫన్ నోట్ పోస్ట్ చేసింది.

ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి,నయనతారతో కలిసి కాతువాకుల రెండు కాధల్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చేస్తోంది.
ఇది కూడా చూడండి
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

