Salman Khan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కామియో అప్పీరియన్సుల గురించి ప్రత్యేకించి చెప్పవనసరం లేదు. ఇప్పటికే షారుక్ఖాన్తోపాటు పలువురు హీరోల సినిమాల్లో అతిథి పాత్రలో మెరిశాడు సల్లూభాయ్. తాజాగా సల్మాన్ ఖాన్ మరో ప్రాజెక్టులో కామియో రోల్లో కనిపించనున్నాడన్నవ వార్త బీటౌన్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ యాక్టర్ రితేశ్ దేశ్‌ముఖ్ నటిస్తోన్న హిస్టారికల్ ఎపిక్ ప్రాజెక్ట్ రాజా శివాజీ.
మరాఠా సామ్రాజ్యం, లెజెండరీ వారియర్స్ కు నివాళిగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అత్యంత నమ్మకస్థుడిగా.. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకోవడం కీలక పాత్ర పోషించాడు జీవా మహల. ఈ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడని బీటౌన్ సర్కిల్ టాక్.
అంతేకాదు సల్మాన్ ఖాన్ సీక్వెన్స్ షూట్‌ను నవంబర్ 7 నుంచి కొనసాగించనున్నారట మేకర్స్. ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా ఉండబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ మూవీలో సంజయ్ దత్ అఫ్జల్ ఖాన్‌గా కనిపించబోతున్నాడు.
రితేశ్ దేశ్‌ముఖ్ సినిమాలో సల్మాన్ ఖాన్ జాయిన్ కాబోతున్నాడన్న వార్తతో ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు అభిమానులు. ఇక సల్మాన్ ఎంట్రీతో ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్‌పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Harish Rai | శాండల్‌వుడ్‌లో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం