Salman khan | మెగాఫోన్ పట్టనున్న సల్మాన్ ఖాన్..టైం వచ్చేసినట్టేనా..?
సుదీర్ఘమైన నట ప్రయాణంలో ఏ రోజూ దర్శకత్వం వైపు అడుగులు వేయలేదు సల్మాన్ ఖాన్ (Salman khan). దర్శకుడికి తోచిన సలహాలు ఇచ్చేవారేమో కానీ నేరుగా మెగాఫోన్ పట్టింది లేదు. అయితే ఇప్పుడా టైమ్ వచ్చిందంటున్నారు సల్మాన్ సన్నిహితులు.
బాలీవుడ్ (Bollywood)లో మూడు దశాబ్దాలు పైబడిన స్టార్ డమ్ సల్మాన్ ఖాన్ (Salman khan)ది. ఇప్పటికీ ఆయన సినిమాలకు అదే క్రేజ్. ఇంత సుదీర్ఘమైన నట ప్రయాణంలో ఏ రోజూ దర్శకత్వం వైపు అడుగులు వేయలేదు సల్మాన్. నటుడిగానే కొనసాగారు. దర్శకుడికి తోచిన సలహాలు ఇచ్చేవారేమో కానీ నేరుగా మెగాఫోన్ పట్టింది లేదు. అయితే ఇప్పుడా టైమ్ వచ్చిందంటున్నారు సల్మాన్ సన్నిహితులు. భాయ్ డైరెక్టర్ అయ్యే సమయం దగ్గర్లోనే ఉందంటున్నారు.
సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కభీ ఈద్ కభీ దివాలీ (Kabhi Eid Kabhi Diwali) త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నది. ఈ చిత్రానికి ఫర్హాద్ సమ్జీ (Farhad samji) దర్శకత్వం వహించాలి. అయితే ఈ చిత్రానికి ఫర్హాద్ బదులు సల్మాన్ దర్శకత్వం చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని సల్మాన్ బృందం చెబుతోంది. వారి మాటల ప్రకారం చూస్తే సల్మాన్ గత ఐదేళ్లుగా తన దర్శకులను గైడ్ చేస్తూనే ఉన్నాడట.
అధికారికంగా దర్శకుడు కాకపోయినా చాలా వరకు సినిమాను తానే దగ్గరుండి చూసుకుంటాడట. సెట్స్ లోనే కాదు ఎడిటింగ్ టేబుల్ దగ్గరా సల్మాన్ ఉండాల్సిందేనన్నది వారు చెబుతున్న సమాచారం. ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సల్మాన్ తో ఇన్షాల్లా అనే చిత్రాన్ని ప్రకటించి ఆపేశారని బాలీవుడ్ లో టాక్ నడుస్తున్నది.
Read Also : Sunny Leone | మంచు విష్ణును భయపెట్టిన సన్నీలియోన్..వీడియో హల్చల్
దిగ్గజ దర్శకుడైన భన్సాలీ సల్మాన్ ఆలోచనల మేరకు దర్శకత్వం చేసేందుకు ఒప్పుకోకపోవడమే ఈ ప్రాజెక్ట్ అటకెక్కడానికి కారణమంటున్నారు. ఇందులో నిజానిజాలు అటు సల్మాన్, ఇటు భన్సాలీ ఎవరో ఒకరు స్పందిస్తేనే తెలుస్తాయి.
Read Also : Prashanth Neel | ‘అది నా స్టైల్..సలార్ తాజా కథ’..పుకార్లపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్
Read Also : Rakhi Sawant | డ్యాన్స్ చేయాలని అడిగిన రాఖీసావంత్..ఆర్ఆర్ఆర్ హీరోల రిప్లై ఇదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

