బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో అభిమానులను నిరాశపర్చాడు. ఇలాంటి సినిమా చేశాడేంటి అంటూ చాలా మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాధే సినిమాను రూ.80 కోట్ల బడ్జెట్‌తో సల్మాన్‌ఖాన్ తన సోదరుడు సోహైల్ ఖాన్ తో కలిసి నిర్మించాడు.
అయితే జీప్లెక్స్ కు రాధే చిత్రాన్ని రూ.190 కోట్లకు అమ్మారట సల్మాన్, సోహైల్. ఈ లెక్కన చూస్తే రూ.80 కోట్లతో తెరకెక్కిన రాధే సినిమాకు రూ.110 కోట్లు అదనంగా వచ్చాయని బీటౌన్ వర్గాల టాక్. సినిమా టాక్ పరంగా డీలా పడిపోయినా కమర్షియల్ కోణంలో చూస్తే రాధే చిత్రానికి వచ్చిన అమౌంట్ కొంతలో కొంత బెటర్ అనే చెప్పొచ్చు. అయితే సల్మాన్ ఖాన్ ఇమేజ్, రేంజ్‌తో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి.
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్