Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో సినీ ప్రముఖలు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంటూ చిరు ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ,
ప్రజా సంక్షేమం కోసం పాటుపడే
శ్రీ నారా చంద్రబాబునాయుడు @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 💐— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2024