చండీగఢ్: గర్భవతి అయిన భార్యపై ఆమె భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడు. దీంతో ఆరు నెలల గర్భిణీ అయిన ఆ మహిళ మంటల్లో కాలి మరణించింది. ఆమె కవలల గర్భిణీ అని పోలీసులు తెలిపారు. (Man set on fire pregnant wife) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామంలో భార్యాభర్తలైన పింకీ, సుఖ్‌దేవ్ నివసిస్తున్నారు. పింకీ ఆరు నెలల గర్భవతి. ఆమె కడుపులో కవలలు పెరుగుతున్నారు.
కాగా, భార్యాభర్తలైన పింకీ, సుఖ్‌దేవ్ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సుఖ్‌దేవ్, గర్భిణీ అయిన భార్య పింకీని మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు మంటల్లో కాలిపోయిన పింకీ మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన సుఖ్‌దేవ్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.