Salaar Movie | రేపు టీవీలోకి వస్తున్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సలార్’.. ఏ ఛానల్లో అంటే.?
Salaar Movie | బాహుబలి తర్వాత ‘సలార్’తో ( Salaar) రెబల్‌స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టామీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
Salaar Movie | బాహుబలి తర్వాత ‘సలార్’తో ( Salaar) రెబల్‌స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టామీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం టీవీలోకి ఎప్పుడు వస్తుందా అని టెలివిజన్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి తీపి కబురు చెబుతూ టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఏప్రిల్ 21న ఆదివారం స్టార్ మా లో సాయంత్రం 5.30 నుంచి సలార్ ప్రీమియర్ కానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. దీంతో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రుతిహాసన్, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా, ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ‘సలార్’ సీక్వెల్ టైటిల్‌ను ‘పార్ట్-1’ చివర్లో రివీల్ చేశారు. మొదటి భాగాన్ని ‘సలార్-పార్ట్-1 సీజ్ఫైర్’ పేరుతో విడుదల చేయగా, రెండో భాగానికి ‘సలార్-2 శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు.
Experience the biggest action entertainer, #SalaarCeaseFire World TV Premiere at 5:30 PM tomorrow only on @StarMaa 💥#SalaarOnStarMaa #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @SalaarTheSaga pic.twitter.com/0nCNphv4DU
— Vamsi Kaka (@vamsikaka) April 20, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

