Salman Khan |బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆయనకి డెత్ త్రెట్ కూడా ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఓ ట్వీట్ చేసి లేని పోని సమస్యలు తెచ్చుకున్నాడు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్టు పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా సల్మాన్‌పై ఆగ్రహజ్వాలలు అలుముకున్నాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సల్లూ భాయ్ ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు.
శనివారం (మే11) సాయంత్రం అనూహ్యంగా భారత్, పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా కొంత మేర తగ్గాయి. అయితే భారత్- పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో భిన్న రకాల స్పందనలు వినిపించారు పలువురు సినీ ప్రముఖులు. ఎవరు కూడా కాంట్రవర్సీ కామెంట్ చేయలేదు. కాని సల్మాన్ మాత్రం భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చూసి విపరీతంగా ట్రోల్ చేశరు. కాల్పుల విరమణపై స్పందించిన సల్మాన్ ఖాన్, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం చేస్తున్నాడంటూ ఏకిపారేశారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడ్డారు.
సల్మాన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేత మాధవీలత ఘాటు విమర్శలు చేశారు. తీవ్రవాదులు ఎక్కడో లేరు భారత్ లోపలే ఉన్నారని.. ముందు వాళ్లను తరిమేయాలని ట్వీట్ చేశారు. మరికొంత మంది మాత్రం ఆ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ తప్పేమీ లేదని అన్నారు. సీజ్ ఫైర్ ఒప్పందానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడని.. పాకిస్థాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను సల్మాన్ ఖాన్ డిలీట్ చేశారని చెప్పుకొస్తున్నారు.