భారత్-చైనా సైనికుల మధ్య లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్మీ అధికారి పాత్రలో సల్మాన్‌ఖాన్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయని, స్వీయ నిర్మాణంలో సల్మాన్‌ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. లద్దాఖ్‌లో షూటింగ్ జరిపేందుకు గల అవకాశాలను చిత్రబృందం పరిశీలిస్తున్నదని, ఈ స్క్రిప్ట్ సల్మాన్‌ఖాన్‌ను బాగా ఇంప్రెస్ చేయడంతో వెంటనే సెట్స్‌మీదకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.