Saikumar | నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, నిర్మాతగా దశాబ్ధాలుగా తన సినీ ప్రస్థానాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు సాయికుమార్ (Saikumar). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. సాయికుమార్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి Sambarala Yeti Gattu (SYG) తాజాగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో రాయప్ప పాత్రలో నటిస్తున్నాడు సాయికుమార్. చేతిలో కర్రపట్టుకున్న లుక్‌తో సాయికుమార్ ఇందులో వృద్ధుడిగా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.
బర్త్ డే సందర్భంగా సాయికుమార్ నటిస్తోన్న 12A Railway Colony నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చేశారు మేకర్స్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమే రా పోలీస్.. అంటూ తన డైలాగ్ డెలివరీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సాయికుమార్ ఇండస్ట్రీలో 50 ఏండ్ల (Saikumar @50 Years) ప్రయాణాన్ని ఈ ఏడాదే పూర్తి చేసుకున్నాడని తెలిసిందే.
సాయికుమార్ దేవుడు చేసిన పెళ్లి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్కీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సాయికుమార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసుకున్నాడు. పుట్టినరోజు సందర్భంగా సాయికుమార్‌కు అభిమానులు, ఫాలోవర్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Wishing the phenomenal actor @saikumaractor, aka THE RAYAPPA from the world of #SambaralaYetiGattu, a very Happy Birthday ❤️🔥
With his commanding screen presence and iconic performance, Rayappa is all set to become a character for the ages 💥
Mega Supreme Hero @IamSaiDharamTej… pic.twitter.com/tFQzoq6Ujz
— BA Raju’s Team (@baraju_SuperHit) July 27, 2025
Celebrating a Roaring voice that created a phenomenon & a beloved performer with powerful role❤️🔥
Team #12ARailwayColony 🚆👹 extends birthday wishes to the Dialogue King @saikumaractor garu 🎉🔥@allarinaresh #KamakshiBhaskarla @DrAnilViswanath @directornanik @srinivasaaoffl… pic.twitter.com/9VPJHTS8Ji
— BA Raju’s Team (@baraju_SuperHit) July 27, 2025
Saanve Megghana | నటి శాన్వీ మేఘన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం వేడుక!.. ‘హారతి తీసుకోండంటూ’ పోస్ట్
Constable Kanakam | ఓటీటీలోకి ‘కానిస్టేబుల్ కనకం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Shobha Shetty | హీరో సుదీప్తో బిగ్ బాస్ బ్యూటీకి గొడవ ఏంటి.. క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి