Saif Ali Khan | ముంబైలో ఈ నెల 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై తన ఇంట్లో ఓ దుండగడు కత్తితో దాడి చేశాడని తెలిసిందే. తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో దాడి జరగ్గా.. అతన్ని 3.30 నిమిషాలకు లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రానాను సైఫ్ అలీ ఖాన్ కలిశాడు.
దాడి జరిగిన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లి తనను కాపాడిన భజన్ సింగ్ రానాను ఇంటికి పిలిపించుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు సైఫ్ అలీఖాన్. భజన్ సింగ్‌తో సైఫ్ అలీఖాన్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ కుర్తా మొత్తం రక్తంతో తడిసిపోయిందని, నడవలేని స్థితిలో ఉన్నాడని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఇప్పటికే మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే.
పదునైన ఆయుధంతో..
సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో హీరోను పొడిచాడు. సుమారు ఆరు చోట్ల బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు లీలావతి ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. రెండు చోట్ల మాత్రం ఆ కత్తి పోట్లు చాలా డీప్‌గా ఉన్నాయని.. ఒక కత్తిపోటు సైఫ్ వెన్నుపూస సమీపంలో డీప్‌గా దిగినట్లు చెప్పారు. మెడ, చేయి, వెన్నులో ఓ పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తెలిపారు. వెన్నులో దిగిన వస్తువును సర్జరీ ద్వారా తొలగించినట్లు వెల్లడించారు.
Saif met auto driver Bhajan Singh Rana, who brought him to the hospital. pic.twitter.com/WqdG9CYFBB
— Saif Ali Khan (@saifalikhan067) January 22, 2025
Saif Ali Khan was drenched in blood and barely able to walk, says auto driver Bhajan Singh pic.twitter.com/hmvkkSShrv
— Saif Ali Khan (@saifalikhan067) January 17, 2025
Sukumar | పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
Dil Raju | విజయ్ వారిసు కలెక్షన్లు రూ.120 కోట్లే.. ఐటీ అధికారులతో దిల్ రాజు.. ?