‘నేపథ్యం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. నాకు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అవకాశాలు మాత్రం తేలిగ్గా రాలేదు. చాలా కష్టపడ్డాను.’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు నటుడు సైఫ్ అలీఖాన్. ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సైఫ్. ‘నేను హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను.
కానీ నాకు అవకాశాలు రాలేదు. దాంతో సెకండ్, థార్డ్ లీడ్ క్యారెక్టర్లు కూడా చేశాను. ఒకానొక దశలో పాత్రలకోసం యాచించాల్సి వచ్చింది.’ అన్నారు సైఫ్. ఈ సందర్భంగా తన కెరీర్లో ఎదురైన ఓ వింత అనుభవం గురించి ఆయన చెబుతూ ‘అవకాశాల్లేక స్టూడియోల చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఓ మహిళా నిర్మాత నాకు ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేది. అయితే ఆ డబ్బు ఇవ్వడానికి ఆమె ఓ కండీషన్ పెట్టింది. తన బుగ్గపై ముద్దు పెడితేనే డబ్బులు ఇస్తాననేది. నేను పది ముద్దులు పెట్టి, వారానికి వెయ్యి రూపాయలు తీసుకునేవాడ్ని.’ అంటూ నవ్వేశారు సైఫ్ అలీఖాన్.