Sai Pallavi Dance | నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ పెళ్లి ఘనంగా జరిగింది. తన చిరకాల ప్రియుడు వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకలో చెల్లి పూజా కన్నన్‌తో కలిసి సాయి పల్లవి డ్యాన్స్ చేసింది. మరాఠీ సాంగ్ అప్సర అలీ పాటకు వీళ్లిద్దరు డ్యాన్స్ చేయగా.. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ వీడియోను మీరు చూసేయండి.
సాయి పల్లవి సోదరి పూజ కూడా సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. పూజా కన్నన్ తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’(Chithirai Sevvaanam) అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో సముద్రఖణి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత పూజాకి మరో సినిమాలో నటించలేదు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సాయి పల్లవికి మేనేజర్‌గా ఉంటోంది పూజ.
ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. నాగ చైతన్యతో ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.
Sai Pallavi n her Sister Danced for Marati Song Apasara Aali ✨🥹❤️@Sai_Pallavi92 #Saipallavi #PoojaKannan#SaiPallaviSisterWedding pic.twitter.com/OkafaHaUsY
— Sai pallavi (@SaiPallavi92s) September 5, 2024
Also Read..