Supreme Court | అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును నిరజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం గురువారం సుధీర్ఘంగా విచారించింది.
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును నిరజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం గురువారం సుధీర్ఘంగా విచారించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు కేజ్రీవాల్ పేరు లేదని సింఘ్వీ వాదించారు.
ఇటీవల కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సీఎం సమాజానికి ప్రమాదకరమేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొందని, బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని ధర్మాసనానికి తెలిపారు. ఒకసారి ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేసిందని, మరోసారి ఈడీ కేసులో బెయిల్ లభించిందని చెప్పారు. కేజ్రీవాల్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని.. సమాజానికి ప్రమాదం లేదని వాదించారు. రెండేళ్లుగా సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదని.. అయితే, జూన్ 26న మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ఒకరకంగా ఇన్సురెన్స్ అరెస్ట్ అని ఆరోపించారు.
సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. బెయిల్ కోసం మొదట ట్రయల్ కోర్టుకు వెళ్లాలని.. నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. సీఎం ప్రత్యేకమైన వ్యక్తి అని.. అందుకు భిన్నమైన పద్ధతిని అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని ఏసీజీ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు రెండో పిటిషన్లో బెయిల్ కోసం అప్పీల్ చేశారు. ఇంతకు ముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సిందిగా కోరింది. హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది.
Read Also :
Solar Energy | పదేండ్లలో 32 రెట్లు పెరిగిన సౌరశక్తి సామర్ధ్యం : ప్రధాని మోదీ
Watch: అంబులెన్స్ లేకపోవడంతో.. చనిపోయిన పిల్లలను భుజాలపై మోసిన తల్లిదండ్రులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

