SYG | టాలీవుడ్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో ఒకడు సాయి దుర్గ తేజ్. ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం సంబరాల యేటి గట్టు (SYG). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇటీవలే కార్మికుల వేతన సమస్యపై ఇండస్ట్రీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోయింది. అయితే తాజా కథనం ప్రకారం ఈ మూవీ చిత్రీకరణ మళ్లీ మిడ్ సెప్టెంబర్‌లో మొదలు కానుంది.
పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ షెడ్యూల్ మొదలు కానుందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఖరీదైన సెట్స్‌లో విదేశీ ఫైటర్లతో సాయిధరమ్ తేజ్ యాక్షన్ పార్ట్‌ను షూట్ చేయనున్నారట. ఈ సీక్వెన్స్ తర్వాత విలన్‌గా నటిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కాంబినేషన్, సాయి దుర్గతేజ్‌తో వచ్చే క్లైమాక్స్ షూట్ ఉండబోతున్నట్టు సమాచారం. ఈ రెండు యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్స్‌తో షూటింగ్ మొత్తం పూర్తి కానుందట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సీజీఐ, వీఎఫ్ఎక్స్ పనులు జెట్‌స్పీడ్‌లో సాగుతున్నాయి. ప్రేక్షకులకు అన్ని పార్మాట్లలో వినోదాన్ని అందించేలా సినిమాను రెడీ చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ ఫుల్ రోల్లో కనిపించబోతుండగా.. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడని టాక్. ఎస్వైజీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Manisha Koirala | ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం.. నేపాల్‌లో పరిస్థితులపై మనీషా కొయిరాలా పోస్ట్..!
Siva Karthikeyan | తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రాకపోవడానికి కారణం అదే: శివకార్తికేయన్
Nandamuri Balakrishna | తొలి దక్షిణాది నటుడిగా.. NSE వద్ద నందమూరి బాలకృష్ణ సందడి