హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘సంబరాల ఏటిగట్టు’(SYG). రోహిత్ కెపి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. 125కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నెల మధ్యలో మొదలయ్యే తాజా షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఈ సీన్స్ చిత్రీకరణ జరుగుతుందని మేకర్స్ తెలిపారు. ఇందులో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్‌గా కనిపించనున్నారు.
ఆయనతో సాయిదుర్గతేజ్ తలపడే యాక్షన్ సీన్స్ ఈ షెడ్యూల్లో తీయనున్నారట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. జగపతిబాబు, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్.