Sai Dharam Tej – Prema Kavali | సాయి ధరమ్ తేజ్ ఇటీవల తన పేరుకు ముందు వాళ్ల అమ్మ పేరును యాడ్ చేసుకుని సాయి దుర్గ తేజ్‌గా మారిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తరువాత కొంత విరామం తీసుకుని విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించి రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నాడు దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్‌ను సాధించిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా వుండగా.. సాయి దుర్గ తేజ్ తన మొదటి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ఉషా పరిణయం ప్రీరిలీజ్ వేడుకు విచ్చేసిన ఆయన ఈ విషయాన్ని ఆ వేదిక మీద పంచుకున్నాడు 14 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో చేయాలి.. ఆ సినిమాకు మా మామయ్య పవన్‌కల్యాణ్ నిర్మాతగా వుండాలి. అయితే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.
కానీ రేయ్ సినిమాతో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాను. అయితే నా మొదటి రిలీజైన సినిమా మాత్రం రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం. అయితే మొదట్లో విజయ్‌భాస్కర్ నాతో చేయాలనుకున్న సినిమాను అదే కథతో ఆది సాయికుమార్‌తో ప్రేమకావాలి పేరుతో రూపొందించాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. నా మొదటి సినిమా రేయ్కు మొదటి హీరో ఆది. నా ప్రేమకావాలిలో హీరోగా నటించాడు. సో.. నేను చేయాల్సిన సినిమా ఆది, ఆది చేయాల్సిన సినిమా నేను చేశాను’ అని చెప్పుకొచ్చారు. అయితే 14 ఏళ్ల క్రితం ఆ సినిమా కథ నేరేషన్లో కలుసుకున్న సాయి దుర్గ తేజ్ ను విజయ్‌భాస్కర్ మళ్లీ ఉషా పరిణయం వేడుకలో కలుసుకున్నాడట. విజయ్‌భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తాన్వీ ఆకాంక్ష హీరోయిన్. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also read..
Nagababu Konidela | అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయండి.. నాగబాబు సెటైర్లు
Uppalapati Surya Narayana | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సూపర్ స్టార్ మహేష్ బాబు మామ మృతి
Tanya Soni: తానియా సోనికి కవిత్వం ఇష్టం.. ఐఏఎస్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల