పాట్నా: ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ స్టడీ సర్కిల్‌లోకి అకస్మికంగా వరద పోటెత్తిన ఘటనలో.. సెల్లార్లో ఉన్న తానియా సోని(Tanya Soni) మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు శ్రేయా యాదవ్, నెవిన్ డాల్వన్ అనే మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. 25 ఏళ్ల తానియా సోనీది ఒరిజినల్‌గా బీహార్. అయితే ఆమె పేరెంట్స్ తెలంగాణలో ఉన్నారు. సింగరేణి కాలరీస్‌లో ఆమె తండ్రి పనిచేస్తున్నారు.
తానియా సోనీకి కవిత్వం అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో ఆమె రెగ్యులర్‌గా కల్చర్ ఈవెంట్లలో పాల్గొనేది. ఇక యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి, సివిల్స్ సర్వీసులో చేరాలన్నది ఆమె జీవిత లక్ష్యం. కానీ జోరుగా వర్షం కురిసిన శనివారం రోజున ఆమె.. రావూస్ అకాడమీలోని లైబ్రరీని సందర్శించింది. భీకరంగా వరద రావడంతో సెల్లార్లో ఉన్న తానియా నీట మునిగి తనువు చాలించింది.
ఢిల్లీ యూనివర్సిటీలో సోనీ చదివింది. నెలన్నర క్రితమే ఆమె కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరింది. ప్రస్తుతం ఆమె గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది. బీహార్‌లోని ఔరంగాబాద్ ఆమె స్వంత ఊరు. కాలేజీ చదువుల కోసం ఢిల్లీ వెళ్లిందామె. అక్కడ పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ప్రస్తుతం ఐఏఎస్‌కు ప్రిపేరవుతోంది.
తానియా తాని తండ్రి పేరు విజయ్ కుమార్. కూతురు మరణవార్త తెలుసుకున్న సమయంలో అతను రైలు ప్రయాణంలో ఉన్నాడు . లక్నోకు వెళ్తున్న అతను నాగపూర్‌లో దిగి.. అక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లయిట్లో వెళ్లాడు. తానియా భౌతికకాయాన్ని బీహార్‌కు తరలిస్తున్నారు. అక్కడే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఐఏఎస్ కావాలన్నది తానియా చిన్ననాటి కల అని ఆమె తండ్రి చెప్పారు.
తమ కుటుంబంలో ఉన్న అత్యంత తెలివైన అమ్మాయి తానియా అని ఆమె తాతయ్య తెలిపారు. ఆమెకు కవిత్వం అంటే ఇష్టమని, డ్యాన్సింగ్ కూడా ఇష్టపడుతుందని, కాలేజీ ఫంక్షన్లలో పర్ఫార్మ్ చేసేది చెప్పారు.
జల సమాధి అయిన మరో విద్యార్థిని శ్రేయా యాదవ్. ఆమె వయసు 25 ఏళ్లు. యూపీలోని అంబేద్కర్ నగర్ ఆమె స్వస్థలం. రావూస్ స్టడీ సర్కిల్లో ఏప్రిల్‌లోనే జాయిన్ అయ్యిందామె. అగ్రికల్చర్లో బీఎస్సీ పూర్తి చేసింది. సివిల్స్ సర్వీస్‌కు ప్రిపేరవుతోంది.
స్టడీ సర్కిల్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నెవిన్ డాల్వన్ మరో వ్యక్తి. 28 ఏళ్ల నెవిన్ది కేరళలోని ఎర్నాకుళం. 8 నెలలుగా అతను ఢిల్లీలో ఉంటున్నాడు. పటేల్ నగరలో అతను స్టే చేస్తున్నాడు. జేఎన్టీయూలో అతను పీహెచ్డీ చేస్తున్నాడు. శనివారం ఉదయం 10 గంటలకు అతను బేస్మెంట్లో ఉన్న లైబ్రరీకి వెళ్లాడు. నెవిన్ పేరంట్స్ 12 ఏళ్లుగా ఎర్నాకుళంలో ఉంటున్నారు.