శుక్రవారం 03 జూలై 2020
Cinema - Feb 16, 2020 , 07:57:27

సాహోకి అదిరిపోయే టీఆర్పీ.. ఆనందంలో ఫ్యాన్స్

సాహోకి అదిరిపోయే టీఆర్పీ.. ఆనందంలో ఫ్యాన్స్

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రం సాహో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం హిందీలో త‌ప్ప మిగ‌తా భాష‌ల‌లో ఫ్లాప్ టాక్‌ని మూట‌గ‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది అక్టోబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ వ‌ర్షెన్స్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఇక హిందీలో మాత్రం డిసెంబ‌ర్ 8నుండి నెట్ ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది . అయితే సాహో చిత్రం హిందీ వ‌ర్షెన్‌ని  జ‌న‌వ‌రి 26న జీ సినిమా ఛానెల్‌లో ప్ర‌సారం చేశారు. బ్రాడ్‌కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన నివేదిక ప్రకారం ‘సాహో’ టెలివిజన్ ప్రీమియర్ 128.20 లక్షల వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఇంత వ్యూయ‌ర్ షిప్ రావ‌డం చాలా ఎక్కువ అని చెబుతున్నారు. బాహుబ‌లి సినిమాతో హిందీ ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రయ్యారు ప్ర‌భాస్‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సినిమాకి అంత టీఆర్పీ రేటు వ‌చ్చింద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  


logo