టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి గాడ్‌ఫాదర్ (Godfather)తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై చిరంజీవి ఇప్పటికే ఓ అప్డేట్ లీక్ చేసి అభిమానుల్లో జోష్ నింపాడు. గాడ్ ఫాదర్ ఆగస్టు చివరలో కానీ, సెప్టెంబర్ మొదట్లో కానీ విడుదలవుతుందని ఆసక్తికర అప్డేట్ అందించాడు చిరు.
కాగా థమన్ ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌ను లీక్ చేసి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇంతకీ థమన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయమేంటో తెలుసా..? థమన్ జోస్యం ప్రకారం లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కనిపించనుందట. అంతేకాదు అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అద్బుతమైన సెంటిమెంట్ సాంగ్ కూడా ఉండబోతుందట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ కీ రోల్లో కనిపించబోతున్నాడు. మరి థమన్ నోటి నుంచి వచ్చినట్టుగా చక్కర్లు కొడుతున్న ఈ మాటలు నిజమయ్యేనా..? లేదా..? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
Read Also : Ram Pothineni | రామ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాడా..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!