First Love | మ్యూజిక్ లవర్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram). ఈ పాపులర్ సింగర్ నుంచి కొత్త పాట వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. తన మధురమైన గొంతుతో సంగీత ప్రియుల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంటాడు సిద్ శ్రీరామ్. తాజాగా ఈ టాలెంటెడ్ సింగర్ నుంచి వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ ఫస్ట్ లవ్ (First Love) . బాలరాజు ఎం డైరెక్షన్లో దీపు జాను, వైశాలి రాజ్ నటించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కు మంచి స్పందన వస్తోంది.
కాగా సాంగ్ లాంచ్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సంజీవ్ థామస్, సిద్ శ్రీరామ్ పాటను ప్రాణం పెట్టి చేశారన్నాడు. పాటలో అద్భుతమైన కథ చూపించారని.. మ్యూజిక్ ఆల్బమ్ చూసిమంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. పాటలో చివరగా వచ్చే విజువల్స్ చూసినప్పుడు హర్ట్ బ్రేక్ అయ్యిందని అన్నాడు థమన్. ఫస్ట్ లవ్ మ్యూజిక్ ఆల్బమ్ మరింత హిట్టవ్వాలని కోరుకుంటున్నానన్నాడు థమన్.
Happy to Release this #FirstLove ❤️
Congratulations Team ROCK This ONE 😍
Produced and acted by @IamVaishaliRaj director @BalarajuM20
@sidsriram @sanjeevthomas
@DeepuJanu
@maruthimaruchowdary @durganarashimha #KittuVissapragadahttps://t.co/2KhaUDF0EH— thaman S (@MusicThaman) August 5, 2024
Kavya Thapar | ఇస్మార్ట్ శంకర్ ఆడిషన్స్‌కు వెళ్లా కానీ.. కావ్య థాపర్ డబుల్ ఇస్మార్ట్ విశేషాలు
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!