Bro | గెట్ రెడీ అంటోన్న ఎస్ థమన్.. బ్రో మ్యూజికల్ బ్లాస్ట్‌కు టైం ఫిక్స్
Bro Teaser | స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్ పోషిస్తున్నారు. బ్రో ఇదే నెలలో రిలీజ్ కానుండటంతో జోష్ నింపే అప్డేట్ ట్వీట్ రూపంలో అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman).
Bro Teaser | స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నాడు. వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన బ్రో టీజర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. బ్రో జులై 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బ్రో ఇదే నెలలో రిలీజ్ కానుండటంతో జోష్ నింపే అప్డేట్ ట్వీట్ రూపంలో అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman). బ్రో మ్యూజికల్ బ్లాస్ట్ త్వరలోనే షురూ కానుంది.. అని థమన్ తెలియజేశాడు.
మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్‌తో బిజీ కానున్నట్టు థమన్ ట్వీట్‌తో అర్థమవుతోంది. రీసెంట్ బజ్ ప్రకారం బ్రో ఫస్ట్ సింగిల్‌ను ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బ్రో నుంచి విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో స్టోరీ ఉండబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చాడు సముద్రఖని.
పవన్ కల్యాణ్ రీసెంట్గా బ్రో డబ్బింగ్ పనుల్లో కూడా పాల్గొన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు సమాచారం.
The Month Of #BRO STARTS
Let’s make
This One the Best Guys 🔥♥️🎧🔊💥#Bro❤️🔥 LOADING 🔊🎧💃 pic.twitter.com/0mGmiLnxif— thaman S (@MusicThaman) July 3, 2023
బ్రో టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

